Kandukur stampede: కందుకూరు ప్రమాదంపై స్పందించిన Pawan Kalyan

by Nagaya |   ( Updated:2022-12-29 07:06:09.0  )
Pawan Kalyan: మైండ్ గేమ్ పాలిటిక్స్‌పై పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో : కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటలో 8మంది మృతి చెందిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకకరమన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను అని అలాంటి కార్యకర్తలు ఇలా ప్రమాదం బారినపడి మృతి చెందడం ఎంతో విచారకరమన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు పవన్ కల్యాణ్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు. అలాగే ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.

Also Read...

కందుకూరు ఘటనపై సీఎం జగన్ రియాక్షన్ ఇదే..!

Advertisement

Next Story