Cm Jaganకు Pawan Kalyan బహిరంగ లేఖ

by srinivas |   ( Updated:2022-12-28 12:25:02.0  )
Cm Jaganకు Pawan Kalyan బహిరంగ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పింఛన్ల అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎన్నికల హామీ ప్రకారం ప్రభుత్వం పింఛన్‌పై రూ.250 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి నెల నుంచి పెంచిన పింఛన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే సర్వే పేరుతో పింఛన్ లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫించన్లు తొలగించడానికే ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సీఎం జగన్‌పై ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నాయి. అడ్డగోలు నిబంధనలతో ప్రభుత్వం పింఛన్లు తొలగిస్తోందంటూ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.

తాజాగా సీఎం జగన్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు. పింఛన్ల తొలగింపుపై ఆయన ప్రశ్నించారు. 4 లక్షల మందికి పింఛన్లు ఎందుకు తొలగించారని నిలదీశారు. పింఛన్‌దారులకు నోటీసులివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లు ఇవ్వకుండా ఉండటానికే నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. పింఛన్లు తొలగించడానికి చెప్పిన కారణాలను తప్పుబట్టారు. పింఛన్లు తొలగించిన వారి వివరాలను లేఖలో వివరిస్తూ పవన్ కల్యాణ్ ప్రశ్నలు సంధించారు.

ఇవి కూడా చదవండి : Ap News: ఆ జిల్లాలో 4485 వేల పింఛన్లకు ఎసరు?

Advertisement

Next Story

Most Viewed