- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిఠాపురంలో కీలక పరిణామం.. వర్మను కలిసిన పవన్ కల్యాణ్
దిశ, వెబ్ డెస్క్: పిఠాపురంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్థానంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా పిఠాపురం సీటును జనసేన అధినేతకు కేటాయించారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పోటీ చేయాలని భావించారు. కానీ పవన్ కల్యాణకు ఈ సీటు వెళ్లింది. తొలుత పవన్ కల్యాణ్ కాకినాడ బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. దీంతో పిఠాపురం సీటు తనదేనని వర్మ ఆశలు పెట్టుకున్నారు. చివరకు సామాజిక వర్గాలను బేరిజు వేసుకున్న పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జనసేన అభ్యర్థుల జాబితాలో పవన్ కల్యాణ్ పేరును ఖరారు చేశారు. దీంతో వర్మ అసంతృప్తి చెందారు. వర్మకు సీటు ఇవ్వాల్సందేనని అటు టీడీపీ నేతలు, కార్యకర్తలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. వర్మను బుజ్జగించారు. దీంతో అసంతృప్తికి చెక్ పడింది.
అయితే వర్మ చేసిన త్యాగాన్ని పవన్ కల్యాణ్ అర్థం చేసుకున్నారు. ఆయనను కలిసి ధన్యవాదాలు చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శనివారం పిఠాపురం వెళ్లిన పవన్ కల్యాణ్.. వర్మను కలిశారు. ఆయనతో చర్చించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తన కోసం వర్మ త్యాగం చేశారని పవన్ చెప్పారు. కూటమి విజయానికి టీడీపీ,జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
అటు వర్మ మాట్లాడుతూ పిఠాపురంపై నమ్మకంతోనే పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్ గెలుపు బాధ్యతలను తన భుజాలపై వేసుకుంటానని స్పష్టం చేశారు.