ఓటమిని అంగీకరించే ధైర్యం లేక.. సభ నుంచి పారిపోయారు: పవన్ కల్యాణ్

by Mahesh |   ( Updated:2024-06-22 06:41:06.0  )
ఓటమిని అంగీకరించే ధైర్యం లేక.. సభ నుంచి పారిపోయారు: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ నేతలు దారుణంగా ఓడిపోయారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. 2019 ఎన్నికల్లో భారీ విజయం సాధించన వారు ప్రతిపక్ష నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని.. సభలో సభ్యులకు కనీస మర్యాద ఇవ్వకుండా తీవ్రమైన మాటలు అన్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని.. ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ ప్రజల తీర్పుతో కేవలం 11 స్థానాలకు పరిమితం అయిందిని పవన్ గుర్తు చేశారు. గతంలో గెలుపుతో విర్రవీగిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఓటమిని తట్టుకుని గెలిచిన 11 మంది అభ్యర్థులైన ప్రజల కోసం ధైర్యంగా నిలబడే సత్తా లేక సభ నుంచి పారిపోయారని పవన్ కల్యాణ్ అన్నారు. కానీ తమ గత ప్రభుత్వం వ్యవహరించిన విధంగా నడుచుకోమని ప్రజల సమస్యల పరిష్కారం కోసం చర్చిస్తామని.. స్పీకర్ ఎన్నిక సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story