ఈసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా ఎవడు ఆపుతాడో చూస్తా: పవన్ కల్యాణ్ (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-06-16 14:48:42.0  )
ఈసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా ఎవడు ఆపుతాడో చూస్తా: పవన్ కల్యాణ్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం వారాహి విజయయాత్రను ప్రారంభించారు. అనంతరం కత్తిపూడి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి అసెంబ్లీలో తప్పకుండా అడుగుపెడతానని.. తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని పవన్‌ కల్యాణ్‌ సవాల్ చేశారు. గత ఎన్నికల్లో అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా తనపై కక్షగట్టి.. గాజువాక, భీమవరంలో ఓడించారని గుర్తు చేశారు. తాను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా దమ్ముంటే అడ్డుకోవాలని సీఎం జగన్‌కు సవాలు చేశారు. అమరావతే రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

Varahi Yatra: ఈసారి ఖాయం.. సీఎం జగన్‌కు పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్

Advertisement

Next Story