- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కల్యాణ్ మాతోనే...చంద్రబాబు అరెస్ట్ చేసిన తీరు అభ్యంతరకరం : దగ్గుబాటి పురంధేశ్వరి
దిశ, డైనమిక్ బ్యూరో : పొత్తుల అంశం అగ్రనాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. ఏపీలో ప్రస్తుతానికి జనసేనతో బీజేపీ పొత్తులో ఉందని వెల్లడించారు. టీడీపీతో పొత్తు విషయంలో ఢిల్లీ పెద్దలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడతాం అన్నారు అంటే బీజేపీతో భాగస్వామిగా ఉన్నట్టే కదా అని పురంధేశ్వరి స్పష్టం చేశారు. విజయవాడ వన్ టౌన్ కోమల విలాస్ సెంటర్‌లో ప్రధాని నరేంద్రమోడీ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా పేదలకు చీరలను దగ్గుబాటి పురంధేశ్వరి పంపిణీ చేశారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పైనా పురంధేశ్వరి స్పందించారు. సీఐడీ కేసు పెట్టి అరెస్టు చేసింది ఈ అంశంపై బీజేపీ స్పందించేదేం ఉంటుంది అని అన్నారు. అయితే చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన విధానం సరిగా జరగలేదని ఈ విషయాన్ని తాము ఖండించినట్లు తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.విశ్వ కర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ యోజన పథకం అమల్లోకి తెచ్చారు అని చెప్పుకొచ్చారు. చేతి వృత్తుల పై ఆధారపడిన హస్త కళాకారులకు రుణాలు మంజూరు చేస్తున్నారు అని అన్నారు. బీజేపీ ఎప్పుడూ సేవకు పెద్ద పీట వేస్తుంది అని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా తాను ప్రధానిని కాదు... దేశ సేవకుడిని అని ప్రకటించుకున్నారు అని చెప్పుకొచ్చారు. మహిళల అభ్యన్నతి కోసం అనేక సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజున ఆర్భాటాలు లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బీజేపీ ఎప్పుడూ ఓట్ల కోసం కాదు.. ప్రజలకు సేవ చేయడం పైనే దృష్టి పెడుతుంది అని దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు.