రేపల్లె రైల్వే స్టేషన్‌లో దారుణం.. హోంమంత్రి సమాధానంపై పవన్ ఫైర్

by srinivas |   ( Updated:2024-05-04 14:07:19.0  )
రేపల్లె రైల్వే స్టేషన్‌లో దారుణం.. హోంమంత్రి సమాధానంపై పవన్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: రేపల్లెను జూదాలకు అడ్డాగా మార్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపల్లెలో కూటమి అభ్యర్థుల తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేపల్లెలో పెచ్చుమీరిన జూద స్థావరాల విషయాన్ని జనసేన నేతలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపల్లెలో పేకాట, మట్టి మాఫియాలు, దోపిడీలు తప్ప అభివద్ధి లేదని ఆరోపించారు. రేపల్లె రైల్వే స్టేషన్‌లో మహిళపై దాడి జరిగితే నిందితులకు ఇప్పటివరకూ శిక్షపడలేదన్నారు. అక్కను వేధించిన వారిపై తిరగబడితే అమర్‌నాథ్ అనే వ్యక్తిని పెట్రోల్ పోసి కాల్చి చంపేశారనిమండిపడ్డారు. ఈ ఘటనపై హోంమంత్రి నిర్లక్ష్యంగా మాట్లాడారని గుర్తు చేశారు. నాయకులు బాధ్యతగా ఉండాలని సూచించారు. జగన్ పాలనలో పోలీసులు ఎప్పుడూ పని చేయలేదని పవన్ ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం బలమైన యాక్ట్‌ను తీసుకొచ్చామని పవన్ స్పష్టం చేశారు. కూటమి మేనిఫెస్టో పట్ల తాను బాధ్యతగా వ్యవహరిస్తానన్నారు. కూటమి ప్రభుత్వంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. తాను బతికి ఉండగా రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వని చెప్పారు. దేశ ఐక్యతను కాపాడానని తెలిపారు. రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైలు పైనే తొలి సంతకం పెడతామని పవన్ హామీ ఇచ్చారు.

Advertisement

Next Story