సరైన వ్యక్తికి సరైన పదవి ఇచ్చారు... పవన్‌‌‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-06-19 13:03:55.0  )
సరైన వ్యక్తికి సరైన పదవి ఇచ్చారు... పవన్‌‌‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సోదరుడు, జనసేన పార్టీ నేత నాగబాబు స్పందించారు. డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషకరమన్నారు. సరైన వ్యక్తి సరైన పదవి ఇచ్చారన్నారు. ఏపీకి మంచి రోజులు వచ్చాయని నాగాబాబు పేర్కొన్నారు.

కాగా రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం పవన్‌కి వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు అభినందనలు తెలిపారు.


Click Here: యాక్షన్ స్టార్ట్.. ఫస్ట్ భేటీలోనే IAS ఆఫీసర్లకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు


Advertisement

Next Story

Most Viewed