- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కల్యాణ్ ముసుగు తీసేశాడు..టీడీపీ కోసమే జనసేన: మాజీమంత్రి వెల్లంపల్లి
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోసమే పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. చంద్రబాబుకి పవన్ కల్యాణ్ దత్తపుత్రుడు అని చెప్పుకొచ్చారు. తన అన్నకి సపోర్టుగా నిలబడలేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. జైలు బయట పవన్ కల్యాణ్ ముసుగు తీసేశారని చెప్పుకొచ్చారు. టీడీపీ పవన్ వేరు వేరు కాదు ఇద్దరు ఒకటేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు అని మండిపడ్డారు. క్రిమినల్ అని రిమాండ్ విధిస్తే అలాంటి చంద్రబాబును పవన్ కల్యాణ్ వెనకేసుకు రావడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. పవన్ కల్యాణ్ నాశనం అయిపోతారంటూ శాపనార్థాలు పెట్టారు. యుద్ధమే కావాలి అంటే యుద్ధమే ఇస్తాం అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాక్యలకు కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌తో యుద్ధానికి తాము సిద్ధమని వెల్లంపల్లి ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కి సరైన దిశ, దశ లేదు. ఒకరితో పెళ్లి మరొకరితో సహజీవనం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయుడుని నమ్ముకుంటే వైసీపీ మాత్రం ప్రజలను నమ్ముకుంది అని వెల్లంపల్లి చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్‌గా పోటీ చేస్తుందని ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఏం పీక్కుంటారో పీక్కోవాలని అన్నారు. టీడీపీ జనసేన మాత్రమే కాదని ఇంకా ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సింగిల్‌గా వస్తామని అన్నారు. ప్రజలు వైసీపీతోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోసం పని చేస్తున్నాడని ఈ విషయాన్ని జనసైనికులు ఆలోచించాలని సూచించారు. జనసైనికులు పవన్ కల్యాణ్‌ను తిరస్కరించాలని సూచించారు. అభిమానులు, జనసైనికులను పవన్ కల్యాణ్ తన కూలీలుగా భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే తనపై పోటీ చేయాలని వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ విసిరారు.