వంగవీటి రాధా పెళ్లి వేడుకల్లో పవన్ కల్యాణ్

by Seetharam |
వంగవీటి రాధా పెళ్లి వేడుకల్లో పవన్ కల్యాణ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణ వివాహ వేడుకల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సందడి చేశారు. వంగవీటి రాధా, పుష్పవల్లి వివాహం విజయవాడలోని పోరంకి మురళీ రీసార్ట్స్‌లో జరిగింది. ఈ వివాహ వేడుకలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ విజయవాడ విమానాశ్రయం నుంచి నేరుగా కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లి దంపతులను ఆశీర్వదించారు. పవన్ కల్యాణ్‌తోపాటు మాజీమంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ ఇతర నేతలు సైతం వంగవీటి రాధా వివాహ వేడుకల్లో సందడి చేశారు.

Advertisement

Next Story

Most Viewed