పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఆ నియోజకవర్గ MLA అభ్యర్థి మార్పు

by GSrikanth |
Janasena Chief Pawan Kalyan Demands Bharat Ratna for Pingali Venkayya
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో ఇద్దరు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. పొత్తులో భాగంగా అవనిగడ్డ, రైల్వేకోడూరు స్థానాలు జనసేనకు కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా.. ఈ రెండు స్థానాలకు అధికారికంగా పార్టీ అధినేత అభ్యర్థులను ఖరారు చేశారు. అవనిగడ్డ అభ్యర్థిగా బుద్ధ ప్రసాద్, రైల్వేకోడూరు అభ్యర్థిగా ఆరవ శ్రీధర్‌ను ప్రకటించారు. అయితే, రైల్వే కోడూరు నియోజకవర్గానికి ముందుగా యనమల భాస్కర్ రావు అనే నేతను ఖరారు చేశారు. ఆయన వైసీపీ నేతలకు అత్యంత సన్నిహితుడు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచురుడుగా తేలింది.

క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన నివేదికలు, జిల్లా నాయకుల అభిప్రాయాలను పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులను పరిశీలించారు. ఈ స్థానంలో అభ్యర్థిని మార్చాలని నిర్ణయించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్న సమయంలో రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం కలసి అక్కడి పరిస్థితిని వివరించారు. ఈ క్రమంలో రైల్వే కోడూరు స్థానం జనసేన అభ్యర్థిగా ఆరవ శ్రీధర్ పేరును ఖరారు చేసినట్లు జనసేన ప్రకటించింది. దీంతో మొత్తం 22 అసెంబ్లీ స్థానాలకు జనసేన అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది.

Advertisement

Next Story

Most Viewed