Pavan Kalyan: నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

by Shiva |
Pavan Kalyan: నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: విధి నిర్వహణలో అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pavan Kalyan) అన్నారు. ఇవాళ జరిగిన కలెక్టర్ల సమావేశంలో అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని స్మగ్లింగ్ (Smuggling) అనే భూతం పట్టి పీడిస్తోందని అన్నారు. ఈ విషయంలో విజిలెన్స్ అధికారులు (Vigilance Officers) నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆఖరికి పెట్రోల్ (Petrol) కూడా కల్తీ అవుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని.. క్షేత్ర స్థాయిలో మంత్రి నాదేండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

ఇక నుంచి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా ఇసుక పాలసీ (Sand Policy)లో కూటమి నాయకులు ఎవరూ జోక్యం చేసుకోవద్దని.. అలా ఏదైన ఘటన తమ దృష్టికి వస్తే బాధ్యులపై చర్యలు ఉంటాయని అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ (YCP) రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని, ఆ అప్పులు తేర్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) నాయకత్వంలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం పని చేస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Advertisement

Next Story