- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వెంటాడిన మృత్యువు.. తల్లిదండ్రుల కళ్లెదుటే చిన్నారి మృతి

దిశ, వెబ్ డెస్క్: చిన్నారిని మృత్యువు వెంటాడింది. తల్లిదండ్రులు చూస్తుండగా ప్రాణం పోయింది. ఈ ఘటన విజయనగరం జిల్లా(Vizianagaram)లో జరిగింది. మదుపాడ సమీపంలో లారీ(Lorry)ని ప్రైవేటు బస్సు(Private Bus) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదేళ్లలోపు చిన్నారి(Little girl) సహా మరో వ్యక్తి మృతి చెందారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 10 మందికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పతికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు మొత్తం బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం భారీగా జరిగింది. పలువురు ప్రయాణికులు బస్సులోనే చిక్కుకోవడంతో సహాయ చర్యలకు శ్రమించాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్రేన్ సాయంతో బస్సును పక్కకు తీశారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కళ్లెదుటే తమ చిన్నారని కోల్పోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆస్పత్రికి ప్రాంగణంలో తల్లిదండ్రుల వేదనను చూసి పలువురు సైతం కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటన అటు వారి స్వగ్రామంలోనూ విషాద ఛాయలను నింపింది.