దీపావళిని వినూత్నంగా జరుపుకున్న పాలకొల్లు MLA

by GSrikanth |
దీపావళిని వినూత్నంగా జరుపుకున్న పాలకొల్లు MLA
X

దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: పాలకొల్లు శాసన సభ్యులు నిమ్మల రామానాయుడు విన్నూత్న రీతిలో దీపావళి పండుగ జరుపుకున్నారు. టిడ్కో లబ్దిదారుల వద్దకు వెళ్ళి వారితో మమేకమై పండగ జరుపుకున్నారు. వారికి ఆంధ్రా పిండివంటలు వండించి పెట్టారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ... పగలనకా, రాత్రినకా కష్టపడుతున్న 7000 మంది టిడ్కో లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. టిడ్కో ఇళ్ళ నిర్మాణం పూర్తయ్యే వరకూ తమ పోరాటం ఆగదని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed