హైడ్రా తరహాలో "ఆపరేషన్ బుడమేరు" : మంత్రి నారాయణ

by M.Rajitha |
హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరు : మంత్రి నారాయణ
X

దిశ, వెబ్ డెస్క్ : బుడమేరులో ఆక్రమణలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే 'హైడ్రా'(HYDRA) తరహాలో "ఆపరేషన్ బుడమేరు" చేపడతామని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడారు. బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అన్నారు. పారిశుద్ధ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని, మరో రెండు రోజుల వరకు వరద ప్రాంతాల్లోని నీటిని తాగొద్దని.. తాము పంపిణీ చేసే నీటిని మాత్రమే తాగాలని బాధితులకు మంత్రి సూచించారు. అంటూ వ్యాధులు ప్రబలకుండా నిత్యం వైద్యారోగ్య శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తోందన్నారు. దాదాపు 77 వేల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లను పునరుద్దరించామని, అతి త్వరలోనే అన్ని విద్యుత్ కనెక్షన్లను పునరుద్దరిస్తామని తెలియజేశారు. వరద ముంపు ప్రాంతాల్లో లక్షా యాభై వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని అన్నారు. మరో రెండు రోజుల్లో ముంపు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక విజయవాడలోని అనేక ప్రాంతాల్లో వరద ముంపుకు కారణం అయిన బుడమేరులోని ఆక్రమణలను యుద్ద ప్రాతిపదికన తొలగించేందుకు 'ఆపరేషన్ బుడమేరు' చేపడతామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed