ఇలాంటి అభిమానులు పవన్ కల్యాణ్‌కు మాత్రమే (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-07-13 06:10:44.0  )
ఇలాంటి అభిమానులు పవన్ కల్యాణ్‌కు మాత్రమే (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ వైపు సినిమాలతో, మరో వైపు వారాహి విజయ యాత్రతో పవన్ కల్యాన్ బిజీ బిజీగా గడుపుతున్నారు. బ్రో, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహరవీరమల్లు వంటి సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వారాహి యాత్ర చేపట్టిన పవన్ కల్యాణ్ తన మాటలకు పదును పెడుతున్నారు. వైసీపీ టార్గెట్‌గా వాలంటీర్లపై చేసిన తీవ్ర విమర్శలు ఏపీలో దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వారాహి రెండో విడత యాత్రలో భాగంగా ఏలూరు పర్యటనలో జన సేన చీఫ్ బిజీగా ఉన్నారు. తనను కలిసిన ప్రజల సమస్యలను వింటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఓ మహిళ పవన్ కల్యాణ్‌ను చూసేందుకు నెలల చిన్నారిని తీసుకొని కారులో వచ్చింది. రూఫ్ టాప్ లోంచి తన అభిమాన హీరో, నాయకుడిని చూసి మురిసిపోయింది. ఇది చూసిన పవన్ చిన్నారిని ఆప్యాయంగా ఎత్తుకున్నారు. తమ అభిమాన హీరో గొప్ప మనసుకు నెటిజన్లు, జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Read More: మెగా ఫ్యామిలీపై నిహారిక మాజీ మామ సంచలన వ్యాఖ్యలు..!

Advertisement

Next Story