కొనసాగుతున్న తుంగభద్ర తాత్కాలిక గేటు ఏర్పాటు పనులు

by M.Rajitha |
కొనసాగుతున్న తుంగభద్ర తాత్కాలిక గేటు ఏర్పాటు పనులు
X



దిశ, వెబ్ డెస్క్ : తుంగభద్ర ప్రాజెక్టులో కొట్టుకు పోయిన19వ గేటు స్థానంలో తాత్కాలిక గేటును అమర్చే పనులు కొనసాగుతున్నాయి. గేట్ల అమరిక నిపుణుడు కన్నయ్య నాయుడి పర్యవేక్షణలో గేటును అమరుస్తున్నారు. ఈ పనుల్లో భాగంగా 19వ గేటు వద్ద కౌంటర్ వెయిట్ ను నిపుణుల బృందం కిందికి దించింది. దాదాపు 30 టన్నుల బరువున్న కౌంటర్ వెయిట్ ను 11 అడుగుల కిందకి నీటిలో దించడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందని, ఏమాత్రం పట్టు తప్పినా అది జారీ నీటిలో కొట్టుకు పోయేదని అధికారులు తెలిపారు. అలాగే ప్రాజెక్టు రాతి నిర్మాణం కావడం వల్ల ఒక్క రాతిముక్క విరిగినా ప్రాజెక్టు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. కొట్టుకు పోయిన గేటు తాలూకు ముక్క ఒకటి లోపలే ఇరుక్కు పోవడం కూడా స్టాప్ లాగ్ బ్లాక్ ను అమర్చడంలో తీవ్ర జాప్యం జరిగిందని అన్నారు. ఇక జిందాల్ లో తయారైన కొత్త గేటు ఎలివెంటును కూడా అమర్చనున్నారు. నిన్నటి నుండి దాదాపు 110 మంది కార్మికులు ఈ పనిలో భాగస్వాములయ్యారు.

Next Story

Most Viewed