Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

by Mahesh |
Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
X

దిశ, వెబ్ డెస్క్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా (Krishna), తుంగభద్ర నదుల(Tungabhadra rivers)కు వరద కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి(Srisailam reservoir) ఏకదాటిగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలో ఎగువ నుంచి వస్తున్న భారీ వరద కారణంగా.. రెండు గేట్లను ఎత్తిన అధికారులు 1,21,990 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం(Srisailam) జలాశయంకు 1,53,418 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. కాగా పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం అందులో 884.30 అడుగులు నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉంటే శ్రీశైలం గేట్లను ఎత్తడంతో.. దిగువన ఉన్న నాగార్జునసాగర్(Nagarjuna Sagar) జలాశయానికి వరద కొనసాగుతోంది. దీంతో సాగర్ గేట్లు, కాలువలు, విద్యుత్ కేంద్రాల నుంచి వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది ఉప్పొంగుతుంది. దీంతో ఈ నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed