వైఎస్ జగన్‌కు ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్ అయ్యింది: మాజీమంత్రి దేవినేని ఉమా

by Seetharam |
వైఎస్ జగన్‌కు ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్ అయ్యింది: మాజీమంత్రి దేవినేని ఉమా
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ పని ఈ ఒక్కసారితోనే ముగిసిపోయిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఐదేళ్లకే మాకొద్దీ జగన్ అని ప్రజలు అంటున్నారని చెప్పుకొచ్చారు. ప్రజలే కాదు చివరికి వైసీపీ నేతలు కూడా అంటున్నారని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఎద్దేవా చేశారు. మాకొద్దీ జగన్ అని ప్రజలు అనుకుంటున్నారని ఈవిషయాన్ని గమనించిన వైసీపీ నాయకులు తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. గత ఎన్నికల ప్రచారంలో జగన్ అడిగినట్టుగానే ఒక్క ఛాన్సే ప్రజలు ఇచ్చారని ఆ ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్ కూడా అయిందని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని దోచుకుని తాడేపల్లి ఖజానాను నింపుకున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల మధ్య వద్దకు వెళ్లలేని దుస్థితి నెలకొందని అన్నారు. ప్రజల వ్యతిరేకతకు భయపడి బ్యారికేడ్లు, పరదాల మాటున వైఎస్ జగన్ తిరుగుతున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వైఎస్ జగన్ అవినీతి, అరాచక పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడంతోపాటు ఆయనను ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story