- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రోజు రాజకీయ ప్రయాణంపై నిర్ణయం ప్రకటిస్తా.. మాజీమంత్రి కొణతాల
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అట్టుడికిస్తున్నాయి. రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరు తమ సత్తాను చాటుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ నేతలు తమతమ పట్టును నిలుపుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుండడంతో ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేత అయినటువంటి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు రాజకీయవర్గాల సమాచారం. ఈ నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ అయ్యారు. ఈ క్రమంలో కొణతాల రామకృష్ణ ఏ నిర్ణయం తీసుకుంటారు అనే విషయం అటు నేతల్లోనూ ఇటు ప్రజల్లోనూ ఉత్కంఠత రేకెత్తిస్తోంది.
అయితే ఆ సస్పెన్స్ కి తెరదించుతూ కొణతాల రామకృష్ణ జనసేనలో చేరే విషయం పైన కొందిగా స్పష్టత ఇచ్చారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ప్రయాణంపై ఏ నిర్ణయం తీసుకున్నది ఈ నెల 21 వ తేదీన ప్రకటిస్తానని తెలిపారు. అలానే ఆయన పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన విషయం గురించి మాట్లాడారు. పవన్ తో జరిగిన సమావేశంలో ఇరువురు ఆంధ్ర అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు సహా అనేక విషయాల గురించి చర్చించుకున్నామని వెల్లడించారు. కాగా ఇంకా తానుఏ పార్టీలో జాయిన్ అవ్వాలో డిసైడ్ చేసుకోలేదని.. ఆ విషయం పైన ఓ నిర్ణయానికి వచ్చిన తరువాత ఎమ్మెల్యే, ఎంపీ పోటీపై మాట్లాడతాననని తెలిపారు. మరో వైపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అనకాపల్లి నుండి పోటీ చెయ్యాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Read More..
గోదావరి జిల్లాల్లో వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి కీలక నేత.. ముహూర్తం ఫిక్స్