- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. నివేదిక సిద్ధం చేసిన అధికారులు
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. వీలైనంత త్వరగా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు కావాల్సిన నిధులపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సుల్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూ నిర్వహించారు. ప్రస్తుతం ఆర్టీసీ నుంచి రూ.125 కోట్ల ఆదాయం వస్తోందని, ఫ్రీ బస్సు స్కీమ్ అమలైతే మరో 125 కోట్లు అదనంగా అవుతుందని, అలా ప్రతి నెలా రూ. 250 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబుకు అధికారులు వివరించారు.
అయితే తొలుత ఈ స్కీమ్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలా లేదా జిల్లాల్లో ప్రారంభించాలా అనేదానిపైనా అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అధికారులు నివేదిక సిద్ధం చేశారు. కర్ణాటక, తెలంగాణలో అమలవుతున్న తీరుపై అధ్యయనం చేసిన అధికారులు.. ఫ్రీ బస్సు స్కీమ్ అమలు అయితే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి నెలా రూ. 260 కోట్లు అదనంగా భారం పడుతున్నట్లు అధికారులు అంచనాలు తయారు చేశారు. అలాగే మరో 2 వేల బస్సులు కొనుగోలు చేయాలని, మొత్తం 3 వేల మంది డ్రైవర్ల అవసరం ఉంటుందని నివేదికలో అధికారులు తెలిపారు.