- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గుడివాడలో ఉద్రిక్తత.. పోటాపోటీగా ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాలు
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి పార్టీ అడుగులు వేస్తోంది. ప్రజలను ఆకర్షించేందుకు వచ్చి ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రుల అభిమాన నటుడు సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతిని కూడా రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నారు పార్టీ నేతలు. దీనితో కృష్ణా జిల్లా లోని గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటు అధికార పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించేందుకు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు రేపు గుడివాడకు వెళ్లనున్నారు.
అలానే అక్కడ నిర్వహించనున్న రా.. కదలిరా సభలో ఆయన పాల్గొనబోతున్నారు. ఇక అధికార పార్టీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో రేపు గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే ఒకే రోజు ఇటు టీడీపీ సభ, అటు కొడాలి నాని కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో.. గుడివాడలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయో అనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో అలెర్ట్ అయిన పోలసులు రేపు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితు తలెత్తకుండా భారీ బందోస్తు ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.