ఒకే వేదికపై ఎన్టీఆర్ కుటుంబం.... దూరంగా జూ.ఎన్టీఆర్

by Seetharam |   ( Updated:2023-08-28 09:02:35.0  )
ఒకే వేదికపై ఎన్టీఆర్ కుటుంబం.... దూరంగా జూ.ఎన్టీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 నాణేన్ని ముద్రించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నందమూరి కుటుంబ సభ్యులు, అతిరథమహారధుల సమక్షంలో నాణేంను విడుల చేశారు. అయితే ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ కుమార్తెలు, అల్లుల్లు టీడీపీ ఎంపీలు ఇతర నేతలు మాత్రమే హాజరయ్యారు. కాసేపట్లో విడుదల చేయనున్నారు. జరగనున్న ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఎన్టీఆర్ కుమారులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణలతోపాటు మరో సోదరుడు, దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరిలతోపాటు మరోసోదరి ఈ ఆరుగురు సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రూ.100నాణేంను విడుదల చేశారు. అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాలేదు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం సైతం అందింది. అయితే దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని తెలుస్తోంది. మరోవైపు నందమూరి కల్యాణ్ రామ్ సైతం హాజరుకాలేదని తెలుస్తోంది.

Advertisement

Next Story