- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ పార్టీ తరుఫున NTR ప్రచారం కన్ఫామ్.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జోరు నడుస్తోంది. ముఖ్యంగా ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఒక పార్టీని మించి మరొక పార్టీ ప్రచారాల జోరు పెంచుతున్నారు. పలువురు సినీ తారలు కూడా ఆయా పార్టీల తరపున ప్రచారం చేస్తున్నారు. ఇకపోతే గతంలో ఎలక్షన్స్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ తరపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే, గత కొద్ది కాలంగా తారక్ టీడీపీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ మళ్లీ టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది.
ఈ ఫొటోలో తెలుగు దేశం పార్టీ ఎన్నికల గుర్తు ఉన్న షర్ట్ ఎన్టీఆర్ ధరించారు. ఈ షర్ట్‌తో తారక్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ‘డెనిమ్ జీన్స్, బ్లాక్ సన్ గ్లాసెస్, బ్లాక్ క్యాప్‌తో తెల్లటి చొక్కా’ ధరించి కనిపించారు. దీంతో తారక్ టీడీపీ తరపున ప్రచారం చేయడానికి సిద్ధమైనట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టగా.. పలువురు నెటిజన్లు ఎన్టీఆర్ ధరించిన చొక్కాపై టీడీపీ గుర్తును మార్ఫింగ్ చేశారని ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు.