చంద్రబాబుకు భద్రత పెంపు?

by srinivas |   ( Updated:2024-01-29 16:30:44.0  )
చంద్రబాబుకు భద్రత పెంపు?
X

దిశ, విశాఖపట్నం ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భద్రత విషయాన్ని ఎన్‌ఎస్‌జీ సమీక్షించి సెక్యూరిటీని పెంచనున్నారని తెలుస్తోంది. సోమవారం రాజమండ్రి కాతేరు టీడీపీ సభలో ఒక్కసారిగా చంద్రబాబుపైకి దూసుకు వచ్చిన జనాన్ని అదుపు చేయలేదని ఏపీ పోలీసులపై ఆగ్రహం ఎన్‌ఎస్‌జీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్‌ఎస్‌జీ కమాండ్ చీఫ్ మంగళవారం ఆంధ్రాకు రానున్నారు. చంద్రబాబు భద్రత విషయంలో ఏపీ పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది.

కాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రమాదం తృటిలో తప్పింది. రాజమండ్రి జిల్లా కాతేరులో టీడీపీ ‘రా కదలిరా’ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ నేతలు, కర్యకర్తలు భారీగా తరలివచ్చారు. అయితే చంద్రబాబుకు దండ వేసేందుకు ఒక్కసారిగా వారంతా ఎడబడ్డారు. దీంతో స్టైజ్‌పై ఉన్న చంద్రబాబు కిందపడబోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబును కింద పడకుండా పట్టుకున్నారు. దీంతో చంద్రబాబుకు ప్రమాదం తృటిలో తప్పింది. అయితే ఈ ఘటనపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నేతలు, కార్యకర్తలు తొందరపాటు పనికి రాదని.. నిదానమే ప్రదానం అని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇష్యూను ఎన్‌ఎస్‌జీ కమాండ్ చీఫ్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story