ఆటో స్టాండ్ కాదండోయ్.. అది ఆర్టీసీ బస్టాండ్!

by Jakkula Mamatha |
ఆటో స్టాండ్ కాదండోయ్.. అది ఆర్టీసీ బస్టాండ్!
X

దిశ, మంత్రాలయం: మంత్రాలయంలో బస్ స్టాండ్ కాస్త ఆటో స్టాండ్‌గా మారిందని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో మరి ఎక్కువగా ఆటోల సంచారం ఆటో స్టాండ్ ల దగ్గర కంటే బస్టాండ్ లోనే ఎక్కువగా ఉంటున్నాయి. ఇది మంత్రాలయం బస్టాండ్ తీరు. దూరపు ప్రాంతాలు ఉదాహరణకు హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు మంత్రాలయం బస్టాండ్ నుండి తుంగభద్ర రైల్వే స్టేషన్ కు వెళ్లే క్రమంలో మంత్రాలయం బస్టాండ్ వెళ్లడం జరుగుతుంది. అయితే గతంలో మంత్రాలయం బస్టాండ్ నుండి తుంగభద్ర రైల్వే స్టేషన్ కు సుమారు ఐదు బస్సులు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య రెండిటికి మాత్రమే పరిమితం కావడంతో స్థానికంగా ఉండే ఆటోలు డైరెక్ట్ గా బస్టాండ్ ఆవరణంలోకే వచ్చి ప్రయాణికులను పిలిచి మరి ఎక్కించుకొని వెళ్లేటువంటి పరిస్థితి నెలకొంది.

దీని నివారణ నిమిత్తం ఏపీఎస్ఆర్టీసీ అధికారులు సైతం ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడం, కనీసం ఇచ్చట ఆటోలు నిలుపరాదు అనే సూచనలు ఇచ్చేటువంటి లేదా జరిమానాలకు సంబంధించినటువంటి బోర్డులు కూడా ఏవి ఏర్పాటు చేయకపోవడం తో పాటు, ఆర్టీసీ అధికారులు సైతం అక్కడ నివారించే ప్రయత్నం చేయలేకపోవడం కారణంగా బస్టాండ్ కాస్త ఆటో స్టాండ్ ను తలపిస్తోంది అని ప్రయాణికులు వాపోతున్నారు. అసలే నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి ఈ విధమైనటువంటి వ్యవహారం కారణంగా మరింత నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు. బస్సులు అందుబాటులో లేని కారణంగా ప్రయాణికులు ఆటోలలో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనడం కారణంగా ఇటు ప్రయాణికులకు అధిక ఆర్థిక భారం ,అటు ఆర్టీసీకి అధిక ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు బాధ్యత వహించి రైల్వే స్టేషన్ కి బస్సులు అందుబాటులో ఉంచాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed