మా ఆస్తులు మాకు ఇచ్చి విడాకులు ఇస్తే ఎటువంటి ఇబ్బంది లేదు: దువ్వాడ వాణి

by Mahesh |
మా ఆస్తులు మాకు ఇచ్చి విడాకులు ఇస్తే ఎటువంటి ఇబ్బంది లేదు: దువ్వాడ వాణి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వాణి, మాధురి ఇష్యూ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గత ఐదు రోజులుగా ఆమె శ్రీనివాస్ ఇంటి ముందున్న కారు షెడ్డులో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నేడు ఆమె ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ.. "నేను నా కూతురు మా హక్కు కోసం పోరాడుతున్నాము.. ఇది మా ఇల్లు.. మా ఇంట్లోనే మేం ఉండడానికి పోరాడుతున్నాము. నా సోదరి వద్ద డబ్బులు అప్పుగా తీసుకొచ్చి శ్రీనివాస్ కు ఇస్తే ఈ ఇంటిని కట్టారు. నా డబ్బులతో కట్టిన ఇంటిని దువ్వాడ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుస్తారా.. ఫ్రెండ్‌షిప్‌ హౌస్ అని ఎక్కడన్నా ఉంటుందా అని ప్రశ్నించారు. అలాగే ఆయన ఊబిలో చిక్కుకున్నారని.. మాధురితో మాకు ఎలాంటి సంబంధం లేదని.. మా వ్యక్తిగత జీవితంలోకి ఆమె వచ్చిందని.. మా ఆస్తులు మాకిచ్చి విడాకులు ఇస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదని దువ్వాడ వాణి మీడియాతో చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story