- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు అధికారంలోకి వస్తే నో ముస్లిం రిజర్వేషన్స్: మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రజాగళం పేరుతో పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట బొప్పూడిలో భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఇదే తొలి సభ కావడంతో మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాని మోడీ సైతం ఈ సభకు హాజరై ప్రసగించారు. ఈ క్రమంలో కూటమి ప్రజాగళం సభపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల ప్రజా గళం సభ అట్టర్ ప్లాఫ్ అయ్యిందని ఎద్దేవా చేశారు.
స్వయంగా ప్రధాని మోడీ పాల్గొన్న సభనే కూటమి విజయవంతం చేసుకోలేకపోయిందని సెటైర్ వేశారు. ముగ్గురు కలిసి పోటీ చేసిన సీఎం జగన్‌ను ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాగళం సభ ద్వారా కూటమి ఇచ్చిన సందేశం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు జీవితమంతా అభద్రతాభావమేనని ఎద్దేవా చేశారు. మైక్ సరి చేసుకోలేని వారు రాష్ట్రాన్ని నడుపుతారా అని చమత్కరించారు. చంద్రబాబు మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు ఉండని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ జనాలు మిమ్మల్ని, మీ కూటమిని నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.
Read More..
స్థానిక నాయకులకే కూటమి టికెట్ ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్..
- Tags
- Ambati Rambabu