- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా భార్య ఆందోళన వెనక మంత్రి అచ్చెన్నాయుడు.. దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: తన భార్యతో రెండేళ్లుగా విభేదాలున్నాయని వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద భార్య వాణి చేసిన ఆందోళనపై ఆయన స్పందించారు. తన భార్య వాణి ఎప్పటి నుంచో అధిపత్య పోరు కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాాలా సార్లు ప్రయత్నం చేశారని తెలిపారు. తన మైనింగ్ వ్యాపారంలోనూ వాణి పేరుండాలని కోరుకుందని చెప్పారు. తాను టెక్కలిలో ఐదుసార్లు ఓడిపోవడానికి భార్యనే కారణమని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు.
‘‘విద్యార్థి దశ నుంచి నేను రాజకీయాలు చేస్తున్నా. ఎమ్మెల్యే కావాలని 25 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నా. ఈ ఎన్నికల్లో జగన్ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో తనకు కూడా టికెట్ కావాలని నా భార్య అడిగారు. విడాకులు కోరుతూ జగన్ వద్దకు సైతం వెళ్లింది. ఎన్నికల తర్వాత విడాకులు ఇస్తానని చెప్పా. ఎన్నికల్లో నేను ఓడిపోయా. ఇండిపెండెంట్ పోటీ చేయాలని నా భార్య ప్రయత్నం చేశారు. నా పిల్లలు నన్ను శత్రువుగా చూస్తున్నారు. ఇద్దరిని డాక్టర్లను చేశా. ఏ లోటూ రాకుండా చూసుకున్నా. వివాదాలు రాకుండా ఆస్తులు సైతం ఇచ్చేశా. ఖర్చుల కోసం రూ. కోటిన్నర ఇచ్చా. కూతుళ్లలో నాపై వ్యతిరేక భావనను వాణి తీసుకొచ్చారు. నా ఇంటి వద్దకు వచ్చేటప్పుడు టీడీపీ మూకలను తీసుకొచ్చారు. నా భార్య ఆందోళన వెనుక మంత్రి అచ్చెన్నాయుడు ప్రోద్బలం ఉంది. నాపై అక్రమంగా కేసులు పెట్టాలని చూస్తున్నారు.’’ అని దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.