విశాఖ ఎమ్మార్వో హత్య కేసులో పురోగతి.. ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌లో నిందితుడి అరెస్ట్

by srinivas |   ( Updated:2024-02-05 16:42:31.0  )
విశాఖ ఎమ్మార్వో హత్య కేసులో పురోగతి.. ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌లో నిందితుడి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ రూరల్ ఎమ్మార్యో రమణయ్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు గంగారామ్‌ను సోమవారం అరెస్ట్ చేశారు. ఎమ్మార్వో హత్య తర్వాత నిందితుడు పారిపోయారని పోలీసులు చెప్పారు. అయితే ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌లో నిందితుడిని గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. గంగారామ్ హైదరాబాద్‌లో‌నూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారని, గత కొద్ది రోజులుగా విశాఖలోనూ భూ లావాదేవీలు సాగిస్తున్నారని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో భాగంగా ఎమ్మార్వో రమణయ్యతో గంగారామ్ పరిచయం చేసుకున్నారని తెలిపారు. ఆర్థిక లావాదేవీల కారణంతోనే ఎమ్మార్వో రమణయ్యను నిందితుడు గంగారామ్ హత్య చేశారని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed