జగన్‌ హయాంలో భారీ స్కాం.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

by srinivas |
జగన్‌ హయాంలో భారీ స్కాం.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు అప్కోలో భారీ కుంభకోణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రాజకీయ అవసరాలకు నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవసరం లేకుండానే క్లాత్ కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ చేశారని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. కోట్ల విలువైన సరుకులు సోసైటీల వద్దే మూలుగుతున్నాయని, కరోనా సమయంలో మాస్కులు వ్యవహారంలోనూ కక్కుర్తికి పాల్పడినట్లు సమాచారం అందింది.

2020-21 మధ్య కాలంలో అప్కో ద్వారా మాస్కులు పంపిణీ చేశారు. అయితే పవన్ లూమ్ క్లాత్ లో కుట్టించిన మాస్కులు సరఫరా చేసి కోట్ల రూపాయలు కొట్టేశారని అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మాస్కు తయారీకి రూ.12 ఖర్చు అవుతోందని కానీ రూ. 31 రూపాయలకు ప్రభుత్వానికి అమ్మినట్లు చూపించి నిధులు స్వాహా చేశారని తేలింది.

దీంతో మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో జరిగిన కుంభకోణాలపై విచారణ చేయిస్తామని చెప్పారు. అక్రమాలను వెలికితీస్తామన్నారు. చేనేత రంగాన్ని ఆదుకుంటామని చెప్పారు. చేనేతను గత సర్కార్ సర్వ నాశనం చేసిందన్నారు. అప్కోలో జరిగిన అవినీతి బయటకు తీస్తామని చెప్పారు. ముడిసరుకు పనిముట్లపై చేనేతలకు సబ్సిడీ ఇస్తామని చెప్పారు. సొసైటీల ద్వారా కార్మికులకు అండగా ఉంటామని మంత్రి సవిత చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed