చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం

by M.Rajitha |
చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Nayudu) అధ్యక్షతన నేడు ఎన్డీఏ(NDA) శాసనసభాపక్ష సమావేశం జరిగింది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఈ సమావేశం జరగగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరితోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎన్డీఏ 100 రోజుల పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 20 నుండి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్ళి ఎన్డీఏ పాలనలో జరుగుతున్న అభివృద్ది గురించి వివరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. చంద్రబాబుకు, ఎన్డీఏకు మద్దతుగా నిలిచినందుకు నన్ను అవమానించారన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో ఎన్డీఏతో జట్టుకట్టానని పేర్కొన్నారు. టీడీపీ, ఎన్డీఏ, జనసేన నేతల సమిష్టి కృషి వల్లే గెలిచామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed