విశాఖలో ‘నేవీ మారథాన్’..భారీగా పాల్గొన్న యువత

by Seetharam |
విశాఖలో ‘నేవీ మారథాన్’..భారీగా పాల్గొన్న యువత
X

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్నం నగరంలో ఆదివారం నిర్వహించిన ‘నేవీ మారథాన్‌’ ఆద్యంతరం ఉత్సాహంగా సాగింది. ఆర్కే బీచ్‌లోని పార్క్‌ కూడలి వద్ద నిర్వాహకులు మారథాన్‌ను నిర్వహించారు. ఈ మారథాన్‌లో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, నేవీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పార్క్ హోటల్ కూడలి నుంచి భీమిలి వరకు ఈ మారథాన్‌ను నిర్వహించారు. 42.2 కి.మీ ఫుల్‌ మారథాన్‌, 21.1 కి.మీ హాఫ్‌ మారథాన్‌, 10కే, 5కే, కిలోమీటర్ల విభాగాల్లో ఈ మారథాన్‌ ఉత్సాహంగా కొనసాగింది. ఇకపోతే ఫుల్‌ మారథాన్‌ను ఈఎన్‌సీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ రాజేశ్‌, హాఫ్‌ మారథాన్‌ను వైస్‌ అడ్మిరల్‌ శ్రీనివాసన్‌, 10కే రన్‌ను నగర సీపీ రవిశంకర్‌ ప్రారంభించారు. అనంతరం విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరగడం.. సక్సెస్ కావడంతో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story