- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నారా లోకేశ్అరెస్టయితే బ్రాహ్మణి ఏం చేయనుందో తెలుసా?
రాష్ట్ర రాజకీయాలు గత 20 రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్ చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. టీడీపీ శ్రేణులన్నీ ఆందోళన బాటపట్టాయి. మరోవైపు వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు పెల్లుబుకుతున్నాయి. ఏ పార్టీకి చెందిన వారు ఆ పార్టీకి బలంగా కొమ్ముకాస్తున్నారు. ఇక మిగిలింది ప్రధాన పార్టీల తలరాతలు మార్చేసే సత్తా ఉన్న తటస్థులు మాత్రమే. వీళ్ల అభిప్రాయాలు స్థిరంగా ఉండే అవకాశం లేదు. ఎన్నికల నాటికి ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఊహించడం కష్టం. అరెస్టు అనంతరం బాబుపై పెరుగుతున్న సానుభూతి వైసీపీ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఈ సానుభూతి తటస్థులపై ప్రభావం చూపుతుందా.. లేక మరేదైనా అంశం తెరమీదకు వస్తుందా అనేది అధికార ప్రతిపక్షాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
దిశ, ఏపీ బ్యూరో: ప్రస్తుత పరిస్థితులను బట్టిచూస్తే.. చంద్రబాబుపై పెట్టిన కేసుల పరంపర ఓ కొలిక్కి వచ్చేట్లు కనిపించడం లేదు. న్యాయస్థానాల్లో వాదోపవాదాలు ఎప్పటికిదాకా కొనసాగుతాయో స్పష్టత లేదు. స్కిల్ డెవలప్మెంటు కేసును క్వాష్ చేయడానికే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. మిగతా కేసుల్లో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈలోగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ బెయిల్‌కు దరఖాస్తు చేశారు. ఈలోగా ఆయన్ని అరెస్టు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వీళ్లిద్దరే కాక మరికొందరు కీలక నేతలను కూడా జైలుకు పంపేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది. ఈ కేసుల్లో ప్రాథమిక ఆధారాల సంగతి పక్కన పెడితే సాగదీతకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది.
లోకేశ్ అరెస్టయితే..
చంద్రబాబును రిమాండుకు పంపడంపై ఈపాటికే రాష్ట్ర వ్యాప్తంగా తటస్థుల్లో చర్చ జరుగుతోంది. కొంతమేర సానుభూతి కూడా వ్యక్తమవుతోంది. ప్రధానంగా నారా భువనేశ్వరి ఆవేదనాభరిత వ్యాఖ్యలు తటస్థులపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఆమె ఎన్నికల దాకా విస్తృత పర్యటనలు చేసే అవకాశముంది. ఒకవేళ నారా లోకేశ్అరెస్టయితే ఆయన భార్య బ్రాహ్మణి యువగళం యాత్రను కొనసాగించే అవకాశాలున్నాయి. ఓ వైపు అత్తా కోడళ్లు, మరోవైపు టీడీపీ–జనసేన ఉమ్మడి యాక్షన్ కమిటీలను రంగంలోకి దింపేందుకు కసరత్తు జరుగుతోంది.
జగన్ మళ్లీ ఎందుకంటే..
వైసీపీ కూడా ‘మళ్లీ జగన్అవసరం ఎందుకంటే’ అనే కార్యక్రమంతో ఓ 45 రోజులపాటు జనంలోకి వెళ్లడానికి సిద్దమైంది. అందులో సీఎం జగన్ కూడా పాల్గొంటున్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైసీపీ అధికారానికి రావాలనే ప్రచారంతో ప్రజల ముంగిటకు వెళ్తున్నారు. దీంతోపాటు చంద్రబాబుపై నమోదైన అవినీతి కేసుల గురించి భారీగా క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికలకు మరో ఆర్నెల్ల సమయం ఉంది. అప్పటికి ఏది అజెండాగా ముందుకు వస్తే దాని ప్రభావం తటస్థులపై ఉండొచ్చని విశ్లేషకుల అంచనా.