- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం జగన్‌కు ఆ పిచ్చి పట్టుకుంది: నారా లోకేష్ తీవ్ర విమర్శలు
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. అనంతపురంలో టీడీపీ నిర్వహించిన శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు ప్రచార పిచ్చి పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు ఏం చేయకుండా ఎన్నికలు దగ్గర పడగానే ఇప్పుడు పనులు చేస్తున్నాడని మండిపడ్డారు. ఐదేళ్లలో చేయని పనులన్నీ జగన్‌కు ఇప్పుడే గుర్తు వస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు జగన్ ఏం చేశాడని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులను మోసం చేశాడని ఫైర్ అయ్యారు. సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పాడు.. రాష్ట్రంలో సంపూర్ణ మద్యంపాన నిషేదం తర్వాతే ఓట్లు అడుగుతానన్నాడు.. కానీ ఏపీలో మద్యం ఏరులై పారుతుందన్నారు. జగన్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకునే అలవాటే లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో ముస్లింలకు రంజాన్ తోఫా అందించాం.. ముగ్గురు మైనార్టీలను రాజ్య సభకు పంపించామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని పథకాలన్నీ రద్దు చేసిన ఘనత జగన్‌కే దక్కుంతుందన్నారు.