- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముందస్తు వస్తే 3.. షెడ్యూలైతే 6.. సైకో జగన్ దండుపాళ్యం గ్యాంగ్ చాప్టర్ క్లోజ్: లోకేష్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: మహా నియంతలే మట్టిలో కలిసిపోయారు.. నువ్వేంత.. నీ అధికార మదం ఎంతా సైకో జగన్ అని అని సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌కు మద్దతుగా చేసిన ఐటీ ఉద్యోగుల ర్యాలీ అడ్డుకునేందుకు రాష్ట్ర సరిహద్దులో యుద్ధ వాతావరణం సృష్టించావని ఫైర్ అయ్యారు. అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లు నేరవేర్చాలని అడిగితే వాళ్లను నిర్భంధించావు.. బాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేస్తోన్న టీడీపీ నేతలపై ఉక్కుపాదం మోపావని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ ఆరాచన విధానాలు ప్రశ్నిస్తే దౌర్జన్యం.. నిలదీస్తే నిర్భంధం అని ఫైర్ అయ్యారు. ప్రజల తిరుగుబాటును అణిచివేస్తే.. అది మరింత ఉధృతమవుతుందని వార్నింగ్ ఇచ్చారు. నీ అరాచక పాలన అంతం ఖాయమన్నారు. ఖాకీలను అడ్డుపెట్టుకుని ఇంకెన్నాళ్లీ ఫ్యాక్షన్ స్వామ్యం సైకో జగన్ అని ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలు వస్తే మూడు నెలలు.. షెడ్యూల్ ప్రకారమైతే మరో ఆరు నెలల్లో సైకో జగన్ దండుపాళ్యం గ్యాంగ్ చాప్టర్ క్లోజ్ అని లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.