- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Target Chandrababu.. త్వరలో ‘అల్లుడు సుద్దులు’ పుస్తకం
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చదువు సంధ్య లేని ఓ మూర్ఖుడని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలుగు సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ వ్యాఖ్యలు చూస్తుంటే అసహ్యమేస్తోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత దారుణంగా ఉన్నాయని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నందమూరి లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై నారా లోకేశ్ వ్యక్తిగత విమర్శలు చేయడం నీచ సంస్కారానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈవెనింగ్ వాక్ చేస్తే అది పాదయాత్ర ఎలా అవుతుందని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుపైనా ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబుపై అల్లుడు సుద్దులు అనే పుస్తకం రాశానని...త్వరలోనే ఈ పుస్తకాన్ని విడుదల చేస్తానని నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు.
టీడీపీ మేనిఫెస్టో మోసపూరితం
తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోపైనా లక్ష్మీపార్వతి సెటైర్లు వేశారు. టీడీపీ మేనిఫెస్టో అంతా మోసపూరితమని దుయ్యబుట్టారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎందుకు అన్ని ఉచితానుచితాలు ప్రకటించారోనని నిలదీశారు. చంద్రబాబు హామీల అమలుకు ఆర్బీఐ సొమ్ము కూడా సరిపోదని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు సమాధి కట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రస్తుతం చంద్రబాబు, లోకేశ్ ఏపీకి వచ్చి పోతున్నారని వచ్చే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇక ప్రవాసీలుగా మిగిలిపోతారని చెప్పారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనా లక్ష్మీపార్వతి తనదైన స్టైల్లో విమర్శలు చేశారు. చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ ప్రచార వాహనం వారాహి రోడ్డెక్కుతోందని చెప్పారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఒంటరిగా వెళ్లి తానేంటో నిరూపించుకోవాలని సూచించారు. టీడీపీతో కలవడం వల్ల పవన్ కల్యాణ్‌కే నష్టమని లక్ష్మీపార్వతి హితవు పలికారు.