- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Deputy CM Pawan:ప్రభుత్వ వైద్య కళాశాలకు పేరు ప్రతిపాదించిన పవన్ కళ్యాణ్.. స్పందించిన సీఎం చంద్రబాబు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) కీలక ప్రతిపాదన చేశారు. ఈ క్రమంలో ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త, తెలుగు తేజం దివంగత డా.యల్లాప్రగడ సుబ్బారావు(Dr. Yallapragada Subbarao) పేరును ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాల(Medical College)కు పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు వివరాలు అందించారు.
ప్రపంచానికి పలు ఔషధాలు అందించిన శాస్త్రవేత్త డా.యల్లాప్రగడ సుబ్బారావు గారి స్వస్థలం భీమవరం, చదువుకున్నది రాజమహేంద్రవరం కాగా కొత్తగా ఏర్పడిన ఏలూరు, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల(Govt Medical College)లో ఏదైనా ఒక దానికి ఆయన పేరు పెడితే సముచితంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ కోరారు. అయితే పవన్ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) స్పందించారు. ఈ ప్రతిపాదనను ఇందుకు పరిశీలించాలని వైద్య ఆరోగ్యశాఖ(Medical Health Department)కు ఆదేశించారు. ఈ క్రమంలో ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించి, పరిశీలించాలని సూచించినందుకు సీఎం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.