టీడీపీకి నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్.. న్యూటన్ ఫార్ములా‌తో ఇన్ డైరెక్ట్‌గా దిమ్మతిరిగే రిప్లై

by Satheesh |
టీడీపీకి నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్.. న్యూటన్ ఫార్ములా‌తో ఇన్ డైరెక్ట్‌గా దిమ్మతిరిగే రిప్లై
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ, జనసేన కూటమి సీట్ల పంపకం వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. పొత్తు ధర్మం పాటించకుండా టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడంపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పొత్తులో ఉన్నప్పుడు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడం సరికాదని చంద్రబాబు తీరును తప్పుబట్టారు. ఈ అంశంపై పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన నేత నాగబాబు స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా దీనిపై రియాక్ట్ అయిన నాగబాబు.. టీడీపీకి ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చారు. ‘చర్యకు ప్రతిచర్య’ ఉంటుందనే న్యూటన్ థర్డ్ లా ఫార్ములాను ట్వీట్ చేసిన బాబు.. కొన్నిసార్లు కొన్ని చట్టాలను గుర్తు చేయవలసి ఉంటుందని ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా సీట్ల ప్రకటనపై సోదరుడు పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. కాగా, నాగబాబు చేసిన ఈ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. సీట్ల పంపకాల్లో తేడా వచ్చినప్పటికీ.. ఎన్నికల్లో మాత్రం టీడీపీ, జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తాయని పవన్ స్పష్టం చేసినప్పటికీ.. నాగబాబు టీడీపీకి కౌంటర్ ఇవ్వడంపై చర్చనీయాంశంగా మారింది.

కాగా, సీఎం జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తుకట్టి ఎన్నికలకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు జనసేనతో చర్చించకుండానే మండపేట, అరకు స్థానాలకు టీడీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. పొత్తులో ఉన్నప్పటికీ తమతో చర్చించకుండా చంద్రబాబు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ రెండు సీట్లను ప్రకటించడంతో తాము కూడా రెండు సీట్లను ప్రటిస్తామని పవన్ తెలిపారు. ఈ మేరకు గణతంత్ర దినోత్సవం రోజున ‘ఆర్’ అనే పదం కలిసొచ్చేలా రాజానగరం, రాజోల్ స్థానాల్లో జనసేన పోటీ చేస్తోందని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed