Minister Ponnam : మూసీ పరివాహక ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం

by Aamani |
Minister Ponnam : మూసీ పరివాహక ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం
X

దిశ,హైదరాబాద్ బ్యూరో : మూసీ పరివాహక ప్రాంతాన్ని పర్యాటక , పారిశ్రామిక, పర్యావరణ, నీటి ఇబ్బందులు లేని అందమైన టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మలక్ పేట నియోజకవర్గం పరిధిలోని సైదాబాద్ మండలంలోని పిల్లి గుడిసెల లో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను, వంట గదులను, నీటి సౌకర్యాన్ని మంత్రి శనివారం పరిశీలించారు . గృహ సముదాయంలోని వారితో మాట్లాడుతూ నీరు, విద్యుత్, తదితర అంశాలపై, అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. స్థానికంగా ఉంటున్న వారికి డబుల్ బెడ్రూం లు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. మూసీ పాత నగరంగా కాకుండా పురోగతి చెందే నగరంగా రూపుదిద్దుకుంటుందని స్పష్టం చేశారు.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచానికి చాటే విధంగా మూసీ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అందమైన టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్ది ఎంతో మందికి ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. పునరావాసం కింద నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బంది, నష్టం లేకుండా చూస్తున్నామని,అందరికీ రిహాబిటేషన్ జరుగుతుందని,అందరూ సహకరించాలని కోరారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా నష్టపోతున్నామని భావిస్తున్న వారితో పాటు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని అన్నారు.హైదరాబాద్ కొత్త ఇనోవేటెడ్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నామని మంత్రి పేర్కొన్నారు.మూసి ప్రక్షాళన ,మూసి పునః నిర్మాణం మూసి భవిష్యత్ ప్రణాళికల తో ముందుకు సాగుతున్నామన్నారు . అనంతరం మంత్రి చంచల్ గూడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నూతన భవనాన్ని పరిశీలించారు.భవనం పూర్తయినప్పటికీ ఇంకా వసతి సౌకర్యాలు కల్పించలేదని స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాల, మంత్రి దృష్టికి తీసుకురాగా త్వరలో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అహ్మద్ బాలాల , రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి , మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ,జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఏంఆర్డిసిఎల్ జాయింట్ డైరెక్టర్ గౌతమి , మూసి డెవలప్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed