PM Modi: ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు భారీ ఏర్పాట్లు

by Shamantha N |
PM Modi: ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు భారీ ఏర్పాట్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా(America)లో మూడ్రోజుల పాటు ప్రధాని మోడీ పర్యటన సాగనుంది. కాగా.. ఆదివారం న్యూయార్క్‌లో ‘మోడీ&యూఎస్‌’(Modi&US) కార్యక్రమం నిర్వహించనున్నారు. కాగా ఈ ఈవెంట్‌కు ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్‌ఏ(IACU) భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి దాదాపు 25వేల మంది హాజరవనుండగా, పెద్దసంఖ్యలో సెలబ్రిటీలు రానున్నట్లు తెలుస్తోంది. 500 మంది కళాకారులు, 350 మంది వాలంటీర్లు, 85 మీడియా వర్గాలు, 40కి పైగా అమెరికా రాష్ట్రాలు ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించనున్నాయని నిర్వాహకులు వెల్లడించారు.

రెండు వేదికలు..

ఈ ఈవెంట్‌లో “ఎకోస్ ఆఫ్ ఇండియా ఏ జర్నీ ఆఫ్ ఆర్ట్ అండ్ ట్రెడిషన్” నిర్వహించనున్నారు. రెండు వేదికల్లో కార్యక్రమం జరగనుంది. ప్రధాన వేదికపై గ్రామీ అవార్డ్ నామినీ చంద్రికా టాండన్, స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియా విజేత ఐశ్వర్య మజుందార్ సహా 382 మంది ఆర్టిస్టులు టాలెంట్ ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రీయ, జానపద, ఆధునిక ఫ్యూజన్ ప్రదర్శనలు ఉండనున్నాయి.

Next Story

Most Viewed