- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం.. ఆహ్వానించిన CM జగన్
దిశ, వెబ్‌డెస్క్: కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ.. వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. సీఎం జగన్ దూరదృష్టి కలిగిన నేత అని కొనియాడారు. ఐదేళ్లుగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారని తెలిపారు. జగన్ లాంటి నాయకుడు ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి కావాలని అభిప్రాయపడ్డారు.
కాగా, వాస్తవానికి ఈ నెల 14న అంటే గురువారం తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన స్వగ్రామం కిర్లంపూడి నుంచి తాడేపల్లి వెళ్లేందుకు రూట్ మ్యాప్ కూడా ప్రకటించారు. అయితే ఈ ర్యాలీకి భారీ ఎత్తున స్పందన రావడంతో దీన్ని రద్దు చేసుకోక తప్పలేదని అభిమానులకు వివరించి.. ఇవాళ పార్టీలో చేరారు. కాగా, కాపు ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం జగన్ ముద్రగడ సేవలను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో ముద్రగడ ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేశారు.
Read More..
BREAKING: చంద్రబాబు సైకిల్ తొక్కలేరు.. నరేంద్ర మోడీ నెట్టలేరు: మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు