‘5 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లు ఇచ్చి తీరాల్సిందే’

by GSrikanth |
‘5 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లు ఇచ్చి తీరాల్సిందే’
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యారు. అభ్యర్థుల జాబితా, ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో సమావేశం జరుగుతున్న హోటల్ వద్ద MRPS నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల్లో అధిక సీట్లు తమ తమ సామాజికవర్గానికి ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. ఐదు అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సమావేశంలో అరుణ్ సింగ్ మాట్లాడుతూ.. కూటమి అభ్యర్థుల విజయం ఖాయంగా కనిపిస్తోందన్నారు. దేశంలో మూడోసారి కూడా మోడీ ప్రధాని కావడం ఖాయమని తెలిపారు. ఏపీలోనూ బీజేపీ తన సత్తా చాటబోతోందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లిక్కర్, ల్యాండ్, ఇసుక మాఫీయా విస్తృతంగా జరుగుతోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కేటాయించిన నిధులను సొంత ప్రయోజనాలకు ప్రభుత్వ పెద్దలు వాడుకున్నారని ఆరోపించారు. నిధులన్నీ వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story