జగన్ నాయకత్వంలోనే పని చేస్తా.. పార్టీ మార్పుపై స్పందించిన విజయసాయిరెడ్డి

by srinivas |
జగన్ నాయకత్వంలోనే పని చేస్తా.. పార్టీ మార్పుపై స్పందించిన విజయసాయిరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్ నాయకత్వంలోనే తాను పని చేస్తానని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఆయన పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై స్పందించిన విజయసాయిరెడ్డి.. వైసీపీని వీడటంలేదని తెలిపారు. తాను వైఎస్సార్ సీపీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. వైసీపీకి తాను విధేయత, నిబద్ధత కలిసిన కార్యకర్తనని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

కాగా విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ కు ఆయన పోటీ చేశారు. అయితే ఆయనకు ఇష్టం లేకపోయినా జగన్ ఆదేశాలతోనే పోటీ చేశారనే ప్రచారం జరిగింది. ఆ ఎన్నికల్లో ఓడిపోవడంపై విజయసాయిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారని ఆ కారణంతోనే వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై స్పందించిన విజయసాయిరెడ్డి వైసీపీలో కొనసాగడంపై క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story