రాజకీయాలు వదిలేస్తా.. ఎంపీ మిథున్ రెడ్డి సంచలన ప్రకటన

by srinivas |
రాజకీయాలు వదిలేస్తా..  ఎంపీ మిథున్ రెడ్డి  సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగి ఫైల్స్ దగ్ధం అయిన విషయం తెలిసిందే. ఈ చర్యను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం కేసును సీఐడీకి అప్పగించింది. అయితే ఫైల్స్ దగ్ధం వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారనే ఆరోపణలు చెలరేగాయి. భూములకు సంబంధించిన రికార్డులను తారుమారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా స్పందించారు. తాము అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తామని ఆయన ప్రకటించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం వెనుకున్న నిజా నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు. చిన్న ఘటన జరిగితే రికార్డులు తారుమారయ్యారని ఆరోపిస్తున్నారన్నారు. తమ ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వందల ఎకరాల భూములను ఆక్రమిచాంమని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాజకీయ లబ్ధికోసమే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నామని, ఎన్నికల ఫండ్ తీసుకొన్నామని కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మిథున్ రెడ్డి ధ్వజమెత్తారు.

పది ఎన్నికల్లో తన తండ్రి పెద్దిరెడ్డి పోటీ చేశారని, ఎప్పుడూ ఒక్క రూపాయి కూడా ఎలక్షన్ ఫండ్ తీసుకోలేదని మిథున్ రెడ్డి తెలిపారు. రికార్డులు తారుమారు చేసేందుకే ఫైల్స్ దగ్ధం చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామని చెప్పారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఉండే వివరాలన్నీ కలెక్టర్, ఎమ్మార్వో, సీసీఎల్ఎల్‌లో కూడా ఉంటాయని చెప్పారు. చిన్న ఘటన జరిగితే రికార్డ్స్ తారుమారు అయ్యే అవకాశం ఉండదన్నారు. ఏ వివరాలు కావాలన్నా తాను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.



Next Story