- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి గన్ మెన్ కాల్పులు.. తీవ్ర ఉద్రిక్తత
దిశ, వెబ్ డెస్క్: ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ఆయన కారుపైనా టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వారు. దీంతో మిథున్ రెడ్డి గన్ మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. టీడీపీ శ్రేణుల ఆందోళన నేపథ్యంలో ఆత్మరక్షణలో భాగంగా మూడు రౌండ్లు గాల్లోకి కాల్చారు. ఈ ఘటనలో మిథున్ రెడ్డితో పాటు వైసీపీ కార్యకర్తల కార్లు ధ్వంసం అయ్యాయి. పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనను టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో వైసీపీ కార్యకర్తలతో మిథున్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు నుంచి వెళ్లిపోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు రెడ్డప్ప ఇంటిపైనా రాళ్లు రువ్వారు. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ఆయన కార్యకర్తలపైనా దాడి చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మిథున్ రెడ్డి పర్యటనకు అనుమతి లేదని అంటున్నారు. మరోవైపు మిథున్ రెడ్డి పుంగనూరు నుంచి వెళ్లిపోవాల్సిందేనని టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.