సీఎం జగన్‌తో ముగిసిన భేటీ.. టీడీపీ ఎంపీ కేశినేని నాని కీలక ప్రకటన

by Satheesh |
సీఎం జగన్‌తో ముగిసిన భేటీ.. టీడీపీ ఎంపీ కేశినేని నాని కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానని.. తన రాజీనామా ఆమోదం పొందగానే వైసీపీలో చేరుతున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జగన్‌తో కేశినేని నాని భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నాని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని, వ్యాపారాలు వదులుకుని పార్టీ కోసం పని చేసిన తనను.. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టించి తనను తిట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది చెప్పినా కూడా నేను టీడీపీలోనే కొనసాగానన్నారు.

నన్ను, ఎవరు ఎన్ని మాటలన్నా, ప్రోటోకాల్ ఉల్లంఘించినా పార్టీ నుంచి కనీస మద్దతు దక్కలేదని అన్నారు. నా కుటుంబంలో చిచ్చు పెట్టి.. నా కుటుంబ సభ్యులతో నన్ను కొట్టించాలని లోకేష్ ఎందుకు చూశారో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు మోసగాడని అందరూ చెబుతున్నా ఇంత పచ్చి మోసగాడు అని మాత్రం తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. ఈ రాష్ట్రానికి అతను ఉపయోగం లేని వ్యక్తి అని ధ్వజమెత్తారు. సీఎం జగన్ నిరుపేదల పక్షపాతి అన్నారు. జగన్ విధానాలు, పనితీరు తనకు నచ్చిందని జగన్‌తో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నానన్నారు.

Advertisement

Next Story

Most Viewed