ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డికి బిగ్ షాక్.. పిటిషన్ కొట్టివేత

by srinivas |   ( Updated:2024-11-28 13:04:39.0  )
ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డికి బిగ్ షాక్.. పిటిషన్ కొట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్: ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి(MP Avinash Reddy PA Raghava Reddy)కి బిగ్ షాక్ తగిలింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కడప కోర్టు(Kadapa Court) కొట్టివేసింది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి(YCP social media activist Varra Ravinder Reddy) కేసులోనూ రాఘవరెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. ఈ రెండు కేసుల్లోనూ పోలీసుల విచారణ కొనసాగుతోంది. అయితే రాఘవరెడ్డి మాత్రం 16 రోజులుగా పరారీలో ఉన్నారు. దీంతో సెర్చింగ్ కూడా కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత, వైఎస్ సునీతపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లా లింగాల మండలం అంబకపల్లిలోని రాఘవరెడ్డి నివాసానికి ఇప్పటికే నోటీసులు అంటించారు. పోలీసులు ఏ క్షణంలోనైనా రాఘవరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కడప కోర్టులో రాఘవరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను గురువారం కోర్టు విచారించింది.

Read More : అదానీని చాలాసార్లు కలిశాం..విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై స్పందించిన జగన్

Advertisement

Next Story