ఆ ఒక్కటి తప్పా ఏం అడిగినా ఇస్తా.. ఎమ్మెల్సీ దువ్వాడ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
ఆ ఒక్కటి తప్పా ఏం అడిగినా ఇస్తా.. ఎమ్మెల్సీ దువ్వాడ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన దివ్వెల మాధురి అనే మహిళతో సహజీవనం చేస్తున్నారని స్వయంగా భార్య వాణి, కూతురు హైందవినే ఆరోపించడం.. అది పోలీస్ కేసు వరకు వెళ్లింది. చివరకు టెక్కలిలోని ఆయన నివాసం వద్ద భార్యా, కూతురు ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా వాణి మీడియాతో మాట్లాడారు. నా డబ్బులతోనే ఆ ఇల్లు కట్టారు. ఈ ఇంట్లోనే మేము ఉంటాం. నా ఇంటిని అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుస్తారా? మా ఆస్తులు మాకు ఇచ్చి విడాకులు ఇస్తే ఇబ్బంది లేదు అని వాణి అన్నారు. వాణి డిమాండ్‌పై శ్రీనివాస్ సైతం స్పందించారు. తాను చనిపోయే వరకు ఈ ఇంట్లోనే ఉంటాను. ఈ ఇల్లు తప్ప ఏం కావాలన్నా రాసి ఇస్తా. వాణి, పిల్లలకు ఆర్థిక ఇబ్బందులు రానివ్వను. మాధురిది డ్రామా కాదు.. డిప్రెషన్. నాపై ట్రోల్స్ చేస్తూ మాధురిని బలి చేశారు.

Advertisement

Next Story