మాకూ ఓ రోజు వస్తుంది.. కూటమి నేతలకు ఎమ్మెల్సీ బొత్స వార్నింగ్

by srinivas |
మాకూ ఓ రోజు వస్తుంది.. కూటమి నేతలకు  ఎమ్మెల్సీ బొత్స వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై పెడుతున్న కేసులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎలాంటి కేసులు ఎదుర్కోటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. కేసుల విచారణకు తాము భయపడమని చెప్పారు. తప్ప చేస్తే శిక్ష తప్పదని, కానీ అమాయకులపై కేసులు పెట్టడం సరికాదని బొత్స సూచించారు. ప్రభుత్వం తమది కాదని, తాము వద్దన్నా విచారణ చేయడం మానరన్నారు. తాను రెడీ కాదని చెపితే విచారణ చేయడం మనరుకాదా.. అని, రెడీ అని అంటే చేస్తారా అని ప్రశ్నించారు. చట్ట ప్రకారం కాకుండా కక్ష సాధింపులకు పాల్పడితే ఇదే రోజు మళ్లీ వస్తుందని, కూటమి నాయకులు గుర్తు పెట్టుకోవాలని ఎమ్మెల్సీ బొత్స వ్యాఖ్యానించారు. ఇతరులపై బురదజల్లడం తమ విధానం కాదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీపై నిలదీస్తామన్నారు. అసెంబ్లీ, శాసనమండలికి వెళ్లామనేది ముఖ్యం కాదని, ప్రజా సమస్యలపై పోరాటం చేశామనేదే చూడాలన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేవరకూ ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని బొత్స హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed